Anchor Shyamala : బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల అటు టీవీ షో లలో బిజీగా ఉంటూ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన శ్యామల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ తరువాత అటు యాంకర్ గాను ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్లతోను బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్న శ్యామల తన యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువైంది. ఇటీవలే విరూపాక్ష సినిమాలో తన నటనతో ప్రశంసలను అందుకున్న శ్యామల తన లైఫ్ స్టైల్, ఫిట్నెస్ గురించి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే…
శ్యామల ప్రస్తుతం తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనూ కనిపిస్తూ ఉంటుంది. తాను దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చానని, తనకు అలా బ్రతకడము తెలుసు ఇప్పుడు ఉన్న కంఫర్ట్ లైఫ్ లో ఉండటం తెలుసు అంటూ చెప్పారు. కొత్తగా కట్టుకున్న విల్లా లోకి మారిన శ్యామల గారు ఇంటి గురించి మాట్లాడుతూ ఇదంతా లేకుండా ఓక గుడిసెలో బ్రతకమన్నా హ్యాపీగా ఉంటాను. అలాగే హై లైఫ్ లోనూ హ్యాపీగా ఉండగలను అంటూ చెప్పారు శ్యామల.

ఇక తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించి అడిగితే తనసలు వర్క్ అవుట్ చేయనని చెప్పారు శ్యామల. ఏదైనా వర్క్ అవుట్ చేయాలని ఒక వారం బాగానే చేసినా తిరిగి ఏదైనా షూటింగ్ లేక వర్క్ తో మానేస్తాను అందుకే అసలు చేయను అంటూ చెప్పారు. ఇక ఫుడ్ విషయంలో బాగా తింటాను కానీ వెజ్ మాత్రమే తింటాను కాబట్టి ఎక్కువ లావెక్కనేమో తెలియదు అంటూ చెప్పారు. ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయక పోయినా రోజూ పదివేల అడుగులు వేయాలనే నియమం మాత్రం పాటిస్తాను, ఇంట్లో పనిచేసుకుంటూనే అది చేస్తాను అంటూ చెప్పారు శ్యామల.
































