కరోనా కారణంగా సెలెబ్రెటీస్ అందరు తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో నుంచి అభిమానులతో తమ అభిప్రాయాలను, వారి యొక్క కుటుంబ సభ్యులు, ఇంట్లో పని చేసేవారితో సహా అందరిని పరిచయం చేస్తూ నిత్యం అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కూడా ఈరోజు ఇంటెర్నేషనల్ వర్కర్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. అంతే కాదు ఆ వీడియోలో తన ఇంట్లో పని చేసే పనిమనిషి మణి ని అందరికి పరిచయం చేసారు.
యాంకర్ సుమ మాట్లాడుతూ “ఈరోజు ఐ సెల్యూట్ అల్ ద వర్కర్స్.. ఈ లాక్ డౌన్ పిరియడ్ లో వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి వర్క్ చేస్తున్న వారందరికీ.. అలాగే ఈ అన్ పెయిడ్ వర్కర్స్ కి కూడా బిగ్ బిగ్ సెల్యూట్… ఎవరో తెలుసా ఇంట్లో పని చేసేటువంటి ఆడవారు అమ్మలు, అమ్మమ్మలు, పెళ్ళాలు, కోడళ్ళు, అత్తలు, పిన్నులు, అబ్బా ఆ లిస్ట్ చాలా పెద్దది… అలాంటి ఆడవాళ్లు మూడుపూటలా ఎంచక్కగా వండి పెట్టి, మళ్లీ స్నేక్స్ అని అడిగితె అవి కూడా చేసి పెట్టి ఇన్ని రోజుల నుంచి ఎలాంటి పారితోషకం ఆశించకుండా చేసిపెట్టేటువంటి మా ఆడవారు అందరికీ బిగ్ బిగ్ సెల్యూట్ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ వర్కర్స్ డే… ” అని చెప్పారు..
ఆ తరువాత తన ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి మణిని పరిచయం చేస్తూ ఆమెకు కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మణి లాంటి వాళ్ళు నా ఇంట్లో ఉన్నారు కాబట్టే నేను బయటకి వెళ్లి షూటింగ్లు హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. అయితే ఇప్పుడు నాకు షూటింగ్ లు లేవు కాబట్టి నేను మణి కలిసి చేసుకుంటూ ఉన్నాము అని అన్నారు..
అదేసమయంలో తన హ్యూమర్ ను కూడా జోడించి “మణి నీ జీతంలో నాకు సగం షెర్ చేస్తావా? ” అంటూ ఫక్కున నవ్వేశారు. సుమ చేసినా ఈ కామెడీకి పనిమనిషి కూడా నవ్వుకుంటుంది. ఆ విడియో మీకోసం…
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…