Anchor Suma House : యాంకర్ సుమ గురించి తెలియని బుల్లితెర అభిమానులు ఉండరు. ఏ చానల్లో ప్రోగ్రామ్ చూసినా దాదాపుగా సుమనే కనిపిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఏ ఆడియో రిలీజ్ ఫంక్షన్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు ఇలా ఏది జరిగినా సుమ ఉండాల్సిందే అన్నట్టుగా అభిమానులు కనెక్ట్ అయ్యారు. టీవీ ప్రోగ్రామ్స్ లోనే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంటుంది. తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఎంతో బిజీగా ఉండే సుమా సోషల్ మీడియాలో కూడా ఎంతో ఆక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు తన ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. అలా షేర్ చేసిన ఫోటోలలో వెనుక కనిపించే ఇల్లు చూస్తే ఈ ఇల్లు ఎక్కడో చూసినట్టుగా ఉంది అని అనిపించడం ఖాయం. నిజమే మరి సుమ ఇల్లు ఎన్నో సినిమాలలో షూటింగుల కోసం వాడుకున్నారు. అది కూడా మన స్టార్ హీరోలు నటించిన సినిమాలలో సుమ ఇంటికి వాడుకున్నారు.

స్టార్ హీరోల సినిమాలలో కనిపించిన సుమ ఇల్లు…..

ఒక వైపు బుల్లితెర మీద తన కెరీర్ లో మంచిగా రాణిస్తూనే ఇంకో వైపు కుటుంబాన్ని కూడా బాగా లీడ్ చేస్తుంది మన సుమ. అయితే సుమ ఇంటిని మనం చాలా సినిమాలలో చూసాం. నాగ చైతన్య హీరో గా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన 100% లవ్ సినిమా అందరికి బాగా తెలిసిందే. ఈ సినిమాలో హీరో నాగచైతన్య ఇల్లు మన సుమ ఇల్లే. అలాగే ఎన్టీఆర్ శ్రీను వైట్ల సినిమా అయిన బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు, ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో మహేష్ బాబు ఇంకా ప్రకాష్ రాజ్ ఉన్న ఇల్లుగా కూడా యాంకర్ సుమ ఇంటినే వాడుకున్నారు.

అంతే కాదు బ్రూస్ లీ సినిమా లో హీరో రామ్ చరణ్ ఇల్లు , ఇంకా కమెడియన్ సునీల్ నటించిన పూలరంగడు సినిమాలోని విలన్ ఇల్లు కూడా సుమదే. ఇలా ఇంకా చాలా సినిమాల్లోని షూటింగ్ లకు సుమ ఇంటిని వాడుకున్నారు .































