Anirudh Ravichandran : అనిరుధ్ రవిచంద్రన్ చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ యువ కెరటం విజయాలతో కంటే తన లవ్ అఫైర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. కోలీవుడ్ ప్లే బాయ్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ అమ్మాయిలను పడేయడంలో కింగు. తన ఈడు వాళ్ళ కంటే అనిరుధ్ తన కన్నా వయసులో పెద్ద వారిని పడేసాడు. ఏం మాయ మంత్రం వేస్తాడో కానీ కోలీవుడ్ హాట్ బ్యూటీ ఆండ్రియా అనిరుధ్ ప్రేమలో పీకల్లోతులో మునిగిపోయింది. వీళ్లిదరూ సహజీవనం చేసారు కూడా. ఆ తరువాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

శృతి హాసన్ తో శృతి లయలు…..

ఆండ్రియా తరువాత అనిరుధ్ శృతి హాసన్ తో ప్రేమాయణం కొనసాగించాడనే పుకార్లు వినిపించాయి. ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలకు సంగీతం వహించిన అనిరుద్ ఆ సమయంలోనే శృతిని పడేసాడని అందరూ అనుమానపడ్డారు. కానీ అది నిజం కాదని కేవలం సంగీతం గురించి మాత్రమే తాము చర్చించుకునే వాళ్ళమని క్లారిటీ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా జోనీత గాంధీ పేరు వినిపిస్తోంది. ఎవరనుకుంటున్నారా.. మా మ్మ మహేష్…. హలమతి అభిభో అంటూ అరబిక్ కుతు పాటతో ఈ మధ్యలో అందరినీ ఊర్రుతలు ఊగించిన గాయని.

రీసెంట్ గా ఒక అవార్డ్ ఫంక్షన్లో, “కిల్, మ్యారీ & కిస్” గేమ్ కోసం అనిరుధ్, సూర్య మరియు రణవీర్ సింగ్‌ల పేర్లను ఎంచుకోమని జోనితకు ఇచ్చినప్పుడు, జోనిత పెళ్లి చేసుకునే ఆప్షన్ కోసం అనిరుధ్‌ను ఎంచుకుంది. దీంతో వీరిద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారనే గుసగుసలు ఎక్కువయ్యాయి. ఇక కీర్తీ సురేష్ తో అనిరుధ్ ప్రేమలో ఉన్నాడని 2021 చివర్లోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని వినిపించినా అది జరగలేదు. కానీ ఈ పుకార్లపై వీళ్లిదరూ స్పందించలేదు. మరి ఈ ప్లే బాయ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో…
































