Anjala Zaveri: సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటే పాత హీరోయిన్లు కనుమరుగవుతూ పోతుంటారు.ఈ విధంగా కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరం కాగా మరికొందరు ఎంతో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారిలో నటి అంజలా జవేరి ఒకరు.
ఈమె విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో కావేరి పాత్రలో నటించి మెప్పించారు. అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించి సందడి చేశారు.ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు వచ్చాయి.
ఇలా వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కన్నడ తమిళ హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే అంజలా జవేరి బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరాను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో సందడి చేశారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి అంజలా జవేరి మంచి సినిమా అవకాశాలు కనుక వస్తే తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక తన భర్త తరుణ్ అరోరా తెలుగు తమిళ భాషలలో విలన్ పాత్రలలో నటిస్తూ ఉన్నారు.ఇక సినిమాలకు దూరమైనటువంటి అంజలా జవేరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…