Anjala Zaveri : ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుట్టిన అంజలా జవేరి, అనతి కాలంలోనే మంచి గుర్తింపు అలాగే అవకాశాలు దక్కించుకుంది. మొదలు పెట్టడమే పెద్ద హీరోతో నటించిన అంజలా ఆ తరువాత చిరంజీవి చూడాలని ఉంది, నాగార్జున రావోయి చందమామ, బాలకృష్ణ సమర సింహా రెడ్డి, భలేవాడివి బాసు వంటి సినిమాలో నటించింది. ఇక సమర సింహా రెడ్డి సినిమాలో రాయలసీమ పౌరుషం ఉన్న ఆడపిల్లగా అంజలా నటన ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగు తెర మీద కనిపించని అంజలా జవేరి హిందీల్ హిమాలయ పుత్ర్ సినిమాతో అడుగుపెట్టింది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నపుడే అమ్మడు తనకంటే ఏడేళ్లు చిన్నోడైన తరుణ్ రాజ్ ఆరోరా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం విలన్ గా అలరిస్తున్న తరుణ్…
తెలుగు సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన అంజలా మళ్ళీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మళ్ళీ ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. అయితే అంజలా భర్త కుడా నటుడే. అది కూడా తెలుగు, తమిళంలో ఈ మధ్య కాలంలో స్టైలిష్ విలన్ పాత్రలలో అదరగొడుతున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో విలన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు తరుణ్.

ఆ తరువాత కాటమ రాయుడు, జయ జానకి నాయక, అర్జున్ సురవరం, వంటి సినిమాల్లో విలన్ గా నటించారు. మొదట డేటింగ్ లో ఉండి ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీరికి ఇంకా పిల్లలు లేరు. కథ అందులో తన పాత్ర నచ్చితే సినిమాలో నటించేందుకు అంజలా రెడీ అన్నట్లు సమాచారం.


































