Annapurnamma : తెలుగు ఇండస్ట్రీ లో తల్లి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అన్నపూర్ణమ్మ. 700 కి పైగా సినిమాల్లో నటించిన అన్నపూర్ణమ్మ అసలు పేరు ఉమా మహేశ్వరి. నాటకాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ఆమె దాసరి నారాయణ రావు గారి సినిమా స్వర్గం నరకం లో మోహన్ బాబు సరసన మొదటి సారి హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమైంది. అటు సినిమాల్లో అడపాదడపా చేస్తూనే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, వంటి షోలలో కామెడీ తో ఆకట్టుకుంటోంది.

రెమ్యూనరేషన్ లో తగ్గేదేలే అంటున్న అన్నపూర్ణమ్మ…
అప్పటి సినిమాలలో హీరోలకు తల్లిగా దాదాపు అందరు హీరోలతో నటించిన అన్నపూర్ణమ్మ ప్రస్తుతం సినిమాలను బాగా తగ్గించారు. రాజా ది గ్రేట్, f3 వంటి సినిమాలతో అలరించిన అన్నపూర్ణమ్మ బుల్లితెర మీద మాత్రం అదరగొడుతోంది. శ్రీ దేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలలో సందడి చేస్తోంది. జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్ టీం లో మెయిన్ లీడ్ గా చేస్తూ ఆమె మీద పంచులకు రివెర్స్ పంచులతో ఆకట్టుకుంటోంది.

కామెడీ టైమింగ్ తో అదరగొడుతోంది అన్నపూర్ణమ్మ. ఇక కామెడీ తో మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరైన అన్నపూర్ణమ్మ రెమ్యూనరేషన్ కూడా బాగానే ఉంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రెండు ప్రోగ్రామ్స్ కాల్ షీట్ కు మూడు లక్షలు ఇస్తున్నారట. ఇది చాలా ఎక్కువ అని అనిపించినా ఆమెకున్న డిమాండ్ ప్రకారం అంత ఇస్తున్నారట మల్లెమాల వారు. సినిమాల్లో తగ్గించినా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను ఈ వయసులో కుడా అలరిస్తున్నారు అన్నపూర్ణమ్మ.



























