తెలంగాణాలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే… అయితే ఈరోజు గురువారం గాంధీ ఆసుపత్రిలో మరో కరోనా పేషేంట్ మృతి చెందాడు. అతని పరిస్థితి వికటించడంతో చనిపోయాడని గాంధీ ఆసుపత్రి సూపరింటెంట్ శ్రావణ్ తెలిపారు. అతని సోదరుకు కూడా ఇదే వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన మృతుడి సోదరుడు ఆసుపత్రిలోని వైద్యులపై దాడి చేసారని వెల్లడించారు.

ఇంతటి కష్ట సమయంలో డాక్టర్లపై ఇలా వ్యవహరించడం సరికాదని తెలిపారు శ్రావణ్. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు తగిన చర్యలు చేపట్టామని వెల్లడించారు. అయితే ఇటువంటి ఘటనలు పునరావతారం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా డాక్టర్లకు విజ్ఞప్తి చేసారు మంత్రి ఈటెల రాజేందర్. మరో వైపు వైద్యులపై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి ఈటెల. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక వైద్యులపై దాడి చేసిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రి నుంచి చెస్ట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసారు. మృతుడితో పాటు దాడి చేసిన అతని సోదరుడు ఇద్దరు ఇటీవలే ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరయ్యారని అధికారులు ధ్రువీకరించారు.

గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ ల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి? డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారు.వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము.

— ఈటల రాజేందర్, మంత్రి

అయితే ఈ మరణంతో తెలంగాణాలో కరోనా మృతుల సంఖ్య 7 కు చేరింది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 కాగా… అందులో 76 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఇవాళ్టి కరోనా వైరస్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here