NTR -ANR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ నటన గురించి అందరికీ తెలిసిందే.ఒకప్పుడు ఈ ఇద్దరి అగ్ర హీరోలు పోటీలు పడి మరి సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయి ఎంతో అవలీలగా ఆ పాత్రలలో నటించేవారు. ఇకపోతే ఏఎన్ఆర్ చివరి సినిమాగా మనం సినిమాలో నటించారు. ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.

ఇదిలా ఉండగా ఏఎన్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఏఎన్నార్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో తాను ఎక్కువగా నటించిన కోస్టార్లలో ఎన్టీఆర్ ఒకరని ఎన్టీఆర్ గురించి ఏఎన్ఆర్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా పని అయిపోతుందని ఎంతో మంది ప్రొడ్యూసర్లు స్వయంగా నాతోనే ఈ మాటలు చెప్పారు.

ఎన్టీఆర్ చూడటానికి ఎంతో గొప్పగా ఉండటమే కాకుండా తన వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉండేది. నటన పరంగా చూస్తే నాకంటే ఎన్టీఆర్ గారికి ఎక్కువ మార్కులు వేయవచ్చు అంటూ ఏఎన్ఆర్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక చిత్రాలలో నటించారు. ఇకపోతే ఎన్టీఆర్ తనని కర్ణుడు వేషం వేయమని ఎంతగానో సూచించారు అయితే తాను మాత్రం కర్ణుడి వేషంలో నటించలేదు. అలాగే చాణక్య చంద్రగుప్త సినిమాలో ఎన్టీఆర్ సూచన మేరకే తాను చాణిక్యుడు వేషం వేశానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఏఎన్ఆర్ వెల్లడించారు.
కృష్ణుడి వేషానికి మారుపేరుగా నిలిచిన ఎన్టీఆర్…
ఇకపోతే కృష్ణుడి వేషం వేసి ఎన్టీఆర్ ఎంతో పాపులర్ అయ్యారు. కృష్ణుడు అనగానే అప్పట్లో ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వచ్చేవారు. ఇక ఎన్టీఆర్ తనని కృష్ణుడి వేషం వేయమని కృష్ణుడి వేషానికి నువ్వు బాగా సెట్ అవుతావు కృష్ణుడి వేషం వేయమని ఎంతగానో కోరారు. అయితే కృష్ణుడి వేషం అంటేనే ఎన్టీఆర్, ఆ వేషం కేవలం ఆయనకు మాత్రమే బాగా సెట్ అవుతుందని అందుకే తాను ఎప్పుడు కృష్ణుడి వేషం వేయలేకపోయానని ఏఎన్ఆర్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.




























