Anshu Malika : ఆర్కే రోజా సెల్వమణి.. తెలుగు ప్రజలకు తెలియని వ్యక్తి కాదు. అటు హీరోయిన్ గా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న రోజా ఆ తరువాత బుల్లితెర మీద అలరించింది. ఇక పోతే రాజకీయ ప్రవేశం చేసి సమాజ సేవ చేస్తోంది. రోజా సినిమాల్లో హీరోయిన్ గా ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుందో అలానే రాజకీయాల్లోనూ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎమ్మెల్యే గా ఎన్నికై ఇక ఇప్పుడు మంత్రి గా రాజకీయాల్లో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు రోజా సినిమాలకు, బుల్లి తెరకు దూరమైనా కూతూరు అన్షు మాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. కూతురు అన్షుమాలిక సోషల్ మీడియా ద్వారా తన సామాజిక కార్యక్రమాల ద్వారా బాగా ఫేమస్.

ఆ హీరో కొడుకుతో జత కట్టనున్న అన్షు మాలిక…
తాజాగా అన్షు మాలిక హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు బయటికి వస్తున్నాయి. అది కూడా ఒక బడా హీరో కొడుకుతో జత కట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. విషయానికి వస్తే తమిళ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ సరసన అన్షు మాలిక నటించనుందని వినిపిస్తోంది. ధృవ్ నటిస్తున్న కొత్త సినిమాలో అన్షు మాలిక హీరోయిన్ గా నటిస్తోందంటూ కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అన్షు మాలిక సినిమాల్లోకి వస్తే మంచి సక్సెస్ సాధిస్తుందంటూ రోజా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్షు ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటోంది. ఒకవేళ అన్షు హీరోయిన్ గా వస్తే రోజా కంటే మంచి సక్సెస్ సాధిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ స్వర్వీస్ తో అన్షు మంచి పేరు తెచ్చుకుంది ఇక సినిమాల్లో నటించి తల్లిని మించి తనయిగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.



























