Anupama Parameswaran: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్. అయితే ఈమె తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకొని తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక తనకు ఏ విషయం గురించి అయినా నిజాయితీగా మాట్లాడటం ఇష్టం అని ఏ విషయం అయినా తనకు ముక్కుసూటిగా చెబుతాను అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు.
ఇక మనకు ఉన్నది చాలా చిన్న జీవితం ఈ జీవితంలో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు చాలా మంచిగా ఉండాలని ఈమె తెలియజేశారు. అయితే కొందరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు జీవితాంతం మనల్ని బాధపెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అనుపమ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలుస్తోంది.
మరి ఈమె జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటి అనే విషయాన్ని వస్తే అనుపమ కెరియర్ పరంగా తనకు రంగస్థలం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.ఈ విధంగా అనుపమ తప్పుకోవడంతో సమంత ఈ సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించారు. అయితే ఈ సినిమాని తాను ఎందుకు మిస్ చేసుకున్నానా అని ఇప్పటికీ బాధపడుతూ ఉంటానని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…