Anushka Shetty : ‘సూపర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనుష్క ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హిట్టు కొడుతూ లేడీ సూపర్ స్టార్ అయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించిన ఈ తరం నటీమణులలో ముందుంటుంది అనుష్క. విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, డార్లింగ్ రెబెల్, బిల్లా వంటి చిత్రాలతో గ్లామర్ డాల్ గా మెప్పించిన అనుష్క, ఆ తరువాత అరుంధతి వంటి లేడీ ఓరియంట్ సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. ఇక ఆ తరువాత పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం, రుద్రమదేవి సినిమాలు ఒక ఎత్తు అయితే, బాహుబలి లో దేవసేన గా నటన మరో ఎత్తు.

అనుష్క పెళ్లి…
ఇక సినిమాలలో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్న స్వీటీ ఇక పెళ్లి చేసుకుంటుంది అంటూ బాగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు అంటూ అనేక కథనాలు వచ్చాయి. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అమెరికాలో ఇల్లు కూడా కొన్నారని వార్తలు వచ్చినా వీటిపై ఇద్దరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లి వార్త వినిపిస్తోంది. అయితే ఈ సారి మాత్రం ప్రభాస్ తో కాదు బెంగళూరు కి చెందిన వ్యాపార వేత్తను అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది అని మాట్లాడుతున్నారు. కానీ అనుష్క ఇంకా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నాలుగేళ్ళ తరువాత అంటే నిశబ్దం సినిమా తరువాత మళ్ళీ అనుష్క సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి తో కలిసి అనుష్క సినిమా చేయబోతోంది. మరి ఈ సినిమా అయ్యాక పెళ్లి చేసుకుంటుందా లేక ముందే పెళ్లి చేసుకుంటుందా అనేది తెలియదు. అయితే ఇంతకాలం డార్లింగ్ ను అనుష్క పెళ్లి చేసుకుంటుంది అని ఆశపడిన ప్రభాస్, అనుష్క అభిమానులకు ఇది చేదు వార్తే మరి.































