Anushka : ‘సూపర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హిట్టు కొడుతూ లేడీ సూపర్ స్టార్ అయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించిన ఈ తరం నటీమణులలో ముందుంటుంది అనుష్క. విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, డార్లింగ్ రెబెల్, బిల్లా వంటి చిత్రాలతో గ్లామర్ డాల్ గా మెప్పించిన అనుష్క ఆ తరువాత ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియంట్ సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. ఇక ఆ తరువాత పంచాక్షరి, భాగామతి, నిశ్శబ్దం, రుద్రమదేవి సినిమాలు ఒక ఎత్తు అయితే, ‘బాహుబలి’ లో దేవసేన గా నటన మరో ఎత్తు. సినిమా కోసం రిస్క్ చేయడం హీరోలకు కామన్ కానీ సినిమాల కోసం హీరోయిన్ రిస్క్ చేయడం అరుదు. ఆది కూడా లావెక్కి తన బాడీ ఫిగర్ ను కోల్పోవడం అంటే హీరోయిన్లు ఒప్పుకోరు. కానీ స్వీటీ అలా కాదు. అందుకే తాను అందరి హీరోయిన్లలో భిన్నంగా హీరోలతో సమానంగా నిలబడింది.

బాలయ్య అన్ స్టాపబుల్ లో సందడి చేయనున్న అనుష్క…
బాలయ్య బాబు మాన్ ఆఫ్ మాసెస్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయనకున్న క్రేజ్ మామూలుది కాదు. ఇక ఆయన సినిమాల్లోనే కాకుండా ఆహా ఒరిజినల్స్ లో వస్తోన్న ‘అన్ స్టాపబుల్’ షో తో అదరగోడుతున్నారు. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఐఏండిబి రేటింగ్స్ లో మంచి పొజిషన్ లో నిలిచి బాలయ్యబాబు స్టామినా చూపింది ఈ షో.

ఇక షో మొదటి సీజన్ లో గెస్టులుగా నాని, రాజమౌళి, అల్లు అర్జున్, రానా వంటి స్టార్లు సందడి చేశారు. ఇక రెండో సీజన్ కి ముస్తాబావుతున్న ఈ షోలో చిరు, పవన్, ఎన్టీఆర్ వంటి వారు పాల్గొంటారు అంటూ వార్తలు వినిపిస్తున్నా ఇపుడు ఈ లిస్ట్ లోకి జేజమ్మ పేరు వినిపిస్తోంది. అనుష్క అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన దేవసేన ఈ షో తో మళ్ళీ ప్రేక్షకులకు కనిపించి సందడి చేయనుంది.

































