Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఉన్న ఫలంగా ఢిల్లీ హోం మంత్రి అమిత్ షాని కలిసిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన గురించి సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈయన ఎందుకు వెళ్లారు అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేస్తున్నాయి.

ముఖ్యంగా హోం శాఖను మరింత పటిష్టం చేయడం కోసమే ఈయన హోమ్ మినిస్టర్ ని కలిసి పలు విషయాల గురించి చర్చించారని తెలుస్తుంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా అమిత్ షావద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు సమాచారం. అయితే తాజాగా మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ అమిత్ షా ని కలవడం వెనుక మరో కారణం ఉందని సమాచారం.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల వివాదం గురించి వార్తలు నిలిచారు. ముఖ్యంగా సరస్వతి పవర్ భూములను టార్గెట్ గా చేసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్లి ఆ భూములను పరిశీలించారు. ఇలా ఆ భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఎక్కువగా అటవీ భూములను ఆక్రమించి తమ సొంత ఆస్తులుగా చేసుకున్నారని వెల్లడించారు. ఈ విషయం గురించి అమిత్ షావద్ద ప్రస్తావించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కేసులను వేగంగా దర్యాప్తు చేయాలని కూడా కోరినట్టు సమాచారం.
బెయిల్ రద్దు..
ఇలా మరోసారి జగన్ కేసుల గురించి దర్యాప్తు జరిపి ఆయన బెయిల్ రద్దు చేయించాలని తిరిగి తనను జైలుకు పంపించే విధంగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారని అందులో భాగంగానే కేంద్ర హోమ్ మినిస్టర్ ను కలిశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే జగన్ మరోసారి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా ఈయన జైలుకు వెళితే వైకాపాకు ప్రాతినిధ్యం వహించే నాయకుడు లేరు. ఇలాంటి తరుణంలోనే జనసేన అలాగే బీజేపీ పార్టీలను ఏపీలో మరింత బలోపేతం చేయవచ్చు అన్న వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.































