ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా..!!

0
319

కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఏపీలో పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయగా.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఈనెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలిపారు.

అయితే ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, కేవలం జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు మాత్రం కొనసాగుతారని స్పష్టం చేశారు.

ఈ ఎన్నిక ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదనే విషయాన్ని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆరువారాల అనంతరం తిరిగి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించి పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. నామినేషన్ వేసిన వారిని భయభ్రాంతులకి గురిచేయకూడదన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేసిందని, తాము కూడా అత్యవసర సమీక్ష నిర్వహించిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here