Archana Shastri : పెళ్లి అయిన తరువాత మొదటి సారి భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పిన అర్చన శాస్త్రి…!

0
369

Archana Shastri : 2004లో ‘తపన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించింది అర్చన. అదే సంవత్సరం ‘నేను’ సినిమాలో తన నటనతో అందరికీ చేరువ అయ్యింది. మొదట వేద పేరుతో సినిమాలకు పరిచయం అయినా తరువాత కొన్నిరోజులకు అర్చన పేరుతో కెరీర్ ను సాగించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్1లో కంటెస్టెంట్ గా వచ్చి 5వ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం వివాహం చేసుకున్న అర్చన చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు.

భర్త గురించి చెప్పిన అర్చన…

అర్చన పెళ్ళైన తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. భర్త నుండి మొదటి నుంచి సపోర్ట్ ఉన్నా సినిమాలకు దూరంగా ఉన్న అర్చన మళ్ళీ సినిమాల్లోకి రానున్నట్లు తెలిపారు. కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన కొత్త సినిమా ‘రంగమార్తాండ’ సినిమా ప్రీవ్యూ సినిమా చూసిన అర్చన సినిమా గురించి మాట్లాడుతూ చాలా బాగుందని సినిమా చూసాక కొన్ని విషయాలు మనకు రిలేటెడ్ గా అనిపిస్తాయి అంటూ చెప్పారు.

మనతో ఉన్న బంధాలను గ్రాంటెడ్ గా తీసుకోరాదు. మనతోనే ఉన్నారు కదా అని తక్కువ చేయకూడదు దూరమయ్యాక కానీ వాళ్ళ విలువ తెలియదు అంటూ చెప్పారు. తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న అర్చన ఇక పై సినిమాల్లో బిజీ కానున్నట్లు తెలిపారు. తన భర్త తనకు ఎపుడూ సపోర్ట్ ఇస్తాడంటూ చెప్పారు అర్చన.