Archana Shastri : మగధీర సినిమాలో అవకాశం అందుకే పోయింది…: నటి అర్చన శాస్త్రి

0
92

Archana Shastri : 2004 లో తపన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించింది అర్చన. అదే సంవత్సరం నేను సినిమాలో తన నటనతో అందరికి చేరువ అయ్యింది. మొదట వేద పేరుతో సినిమాలకు పరిచయం అయిన తరువాత కొన్నిరోజులకు అర్చన పేరుతో కెరీర్ ను సాగించింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్1లో కంటెస్టెంట్ గా వచ్చి 5వ స్థానం లో నిలిచింది. అయితే ప్రస్తుతం వివాహం చేసుకున్న అర్చన చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంది. తాజాగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని సినిమాలలో తనకు అవకాశం ఎలా పోయిందో వివరించారు.

అలా మగధీర అవకాశం పోయింది…

నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు, పాండురంగడు వంటి సినిమాలలో మంచి పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది అర్చన. అయితే హీరోయిన్ గా మాత్రం సక్సెస్ పొందలేకపోయింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. చాలా రోజులుగా అభిమానులకు దూరంగా వున్న అర్చన తాజాగా పలు ఇంటర్వ్యూ లలో కనిపించింది.

తాను మగధీర సినిమాలో చేసి ఉంటే హీరోయిన్ గా మంచి ఆఫర్స్ వచ్చుండేవి అంటూ చెప్పిన అర్చన ఆ సినిమా ఆఫర్ ఎలా వదులుకున్నది తెలిపింది. యమదొంగ సినిమాలో ఒక పాట చేసిన తరువాత, రాజమౌళి మగధీర సినిమాలోని సలోని పాత్రకు అడిగారు. అపుడు హీరోయిన్ గా చేస్తుండటం వల్ల ఆ పాత్ర అవసరమా చేయడం అని సరైన అవగాహన లేకుండా వచ్చిన అవకాశన్ని మిస్ చేసుకున్నాను అంటూ చెప్పారు. ఒకవేళ ఆ సినిమాలో చేసుంటే తరువాత మర్యాద రామన్న సినిమాల్లో హీరోయిన్ అయ్యుండేదాన్నేమో అని చెప్పుకొచ్చారు.