టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అరియనా ఆ తర్వాత బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అరియాన హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అరియనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఇదివరకే తను కొత్త ఇంటికి మారినట్లు అభిమానులతో పంచుకున్న అరీయాన ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని తాజాగా తన అభిమానులను కోరారు.
ఈ క్రమంలోనే అరియాన తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించగా తన ఫాలోవర్స నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు ఈమెకు ప్రపోజల్స్ పెట్టడంతో సతమతమయ్యారు. అదేవిధంగా మరికొందరు నెటిజన్లు అరియాన వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు తన వాట్సప్ డీపీ, ఫోన్ వాల్ పేపర్ వంటి సీక్రెట్ విషయాలను అడగడంతో అరియాన వాటిని సైతం షేర్ చేశారు. అరియాన వాట్సప్ డీపీ, వాల్ పేపర్‌గా తన ఫోటోలను పెట్టుకున్నట్లు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…