Arjun Kalyan : బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా ఉన్న అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కి వచ్చే ముందు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక అందులో తన వ్యక్తిగత జీవితం గురించి, తన లవ్ అన్ని విషయాలను చెప్పాడు. అమెరికాలో ఉద్యోగంలో ఉన్న అర్జున్ కళ్యాణ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండియా తిరిగి వచ్చేసాడు. ఇక షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ మొదలు పెట్టిన అర్జున్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా సెటిల్ అవ్వాలన్నదే తన కోరిక అంటూ చెప్పారు.

శ్రీ సత్య అంటే క్రష్…
కొవ్వూరులో పుట్టిన అర్జున్ కళ్యాణ్ తండ్రి ఎల్ఐసీ ఉద్యోగి అవ్వడం వల్ల రాష్ట్రమంతా తిరగడం వల్ల అన్ని ప్రాంతాల్లో పెరిగాడట అర్జున్. ఇక గీతం యూనివర్సిటీ లో బి టెక్ చేసిన అర్జున్ ఆ తరువాత మాస్టర్స్ కి అమెరికా వెళ్ళాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ న్యూ యార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి యాక్టింగ్ కోర్స్ చేసాడు. ఇక ఇండియా తిరిగి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సుకుమార్ వంటి డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాడు.

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న అర్జున్ తనకు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ క్రష్ ఎవరు అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన శ్రీసత్య అంటూ చెప్పాడు. ఇక మాస్టర్స్ చదివేప్పుడు మొదటి కిస్ జరిగింది అంటూ చెప్పాడు. బ్రేక్ అప్ అయ్యాక కూడా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో టచ్ లో ఉన్నానని, ఫ్రెండ్స్ లా ఉన్నామని చెప్పాడు. అయితే ఒక అమ్మాయి విషయంలో మాత్రం ఎందుకు ఐ లవ్ యు చెప్పానని పాశ్చాత్తాప పడ్డాను అంటూ చెప్పారు. ఇక హీరో నాని, విజయ్ దేవరకొండ అంటే ఇష్టముంటూ చెప్పిన అర్జున్ వాళ్ళలాగా సెల్ఫ్ మేడ్ హీరోలా ఎదగాలని అనుకుంటున్నాను అంటూ అర్జున్ చెప్పాడు.






























