Arjun Kapoor : లివింగ్ టు గెథెర్ రిలేషన్.. ఈ మధ్య ఈ జబ్బు సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ పాకిపోయింది. సహజీవనం తప్పు కాదని సుప్రీం కోర్ట్ కూడా ఒప్పుకుంది. అయితే సహజీవనము అంటూ కొన్నిరోజులు బాగా తిరిగి మళ్ళీ ఏదో ఒక పేఛీ పెట్టుకుని విడిపోయి కొత్త పార్టనర్ ను వెతుక్కుంటున్నారు. ఇక ఈ విషయంలో బాలీవుడ్ నాలుగు ఆకులు ఎక్కువ చదివింది. పాశ్చాత్య సంస్కృతిని మేమే అందిపూచ్చుకున్నాం, ఇక్కడ దానికి మేమే వారసులం అన్నంత ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. పెళ్లి అవసరమా అనే ధోరణిలో బ్రతుకుతున్నారు. ఇక ఇలాంటి సమాధానమే ఇప్పుడొక బాలీవుడ్ హీరో నుండి వినిపిస్తోంది.

పెళ్లి ఆలోచన లేదు…
బాలీవుడ్ హీరో బోని కపూర్ తనయుడు అర్జున్ కపూర్ హీరో గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైనా అంత పెద్ద హిట్టు సినిమాలేవి లేవు. ఒకటి అరా ఏదో హిట్ అయినా ఇతగాడికి పెద్దగా పేరు రాలేదు. ఇక ప్రేమాయణం తో మాత్రం బాగా ఫేమస్. 37 ఏళ్ల అర్జున్ కపూర్ తనకంటే 11 ఏళ్ళు పెద్దదైన మలైకా ఆరోరా ని ప్రేమిస్తున్నాడు. మలైకా ఆరోరా కి ఆల్రెడీ పెళ్ళై ఒక కొడుకు ఉన్నాడు. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తో వివాహం జరిగింది కొడుకు ఉన్నా 2017 లో ఇద్దరూ విడిపోయారు. ఇక ఇపుడు అర్జున్ కపూర్ ని ప్రేమిస్తూ ఉంది మలైకా ఆరోరా. పెళ్లి జరగలేదు అన్న ఒక్క మాటే కానీ ఇక వీళ్ళిద్దరూ భార్యభర్తలలాగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

దీంతో బాలీవుడ్ మీడియా వీరికి చాలా సార్లు పెళ్లి అంటూ వార్తలు వేసింది. అప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వదిలారు. ఇక తాజగా అర్జున్ కపూర్ కాఫీ విత్ కరణ్ షో కి వచ్చినపుడు ఈ విషయం గురించే కరణ్ జోహార్ ప్రశ్నించాడు. దీంతో పెళ్లి మీద క్లారిటీ ఇచ్చాడు అర్జున్. పెళ్లి ఆలోచన లేదని ఇప్పట్లో మేము పెళ్లి చేసుకోమని స్పష్టంగా చెప్పేసాడు. కరోనా రెండేళ్లు లాక్ డౌన్ వల్ల సినిమా లేక బాగా బోర్ కొట్టిందని, సినిమాలు ఉంటే ఆది నాకు సంతోషాన్ని ఇస్తుందని అప్పుడే నా పార్టనర్ ని కూడా బాగా చూసుకోగలంటూ చెప్పాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమా మీద తన కెరీర్ మీద అంటూ చెప్పాడు.































