Arjun Sarja : తమిళ తెలుగు, కన్నడ ఇండస్ట్రీ లో బాగా గుర్తింపు ఉన్న హీరో అర్జున్. కన్నడిగ అయినా అర్జున పరిచయమైంది మాత్రం తమిళ ఇండస్ట్రీ లో, ఆ తరువాత మంచి హిట్లు తెలుగు ఇండస్ట్రీ లోనూ అందుకున్నాడు. తన సినిమాలో జెంటల్ మెన్, ఒకేఒక్కడు, శ్రీ మంజునాథ వంటివి బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు. యాక్షన్ హీరోగా అలరించిన అర్జున్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను తెలుగు, తమిళం, వంటి పలు భాషలలో చేస్తున్నాడు.

అర్జున్ కి మాతృ వియోగం…
యాక్షన్ హీరో అర్జున్ ఇంట విషాదం నెలకొంది. తల్లి లక్ష్మి దేవమ్మ మరణించారు. 85 ఏళ్ల వయసులో ఆమె మరణించారు. లక్ష్మి దేవమ్మ గారు చదువుకున్న, వ్యక్తి మైసూర్ లో కొంత కాలం టీచర్ గా కూడా పని చేసారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇక అర్జున్ కుటుంబంలో చాలా మంది సినిమా పరిశ్రమలో ఉన్నారు.

ఒక వైపు అర్జున్ తో పాటు ఆయన కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ కాగా, మేనల్లుళ్ళు చిరంజీవి సర్జ, ధ్రువ సర్జ కూడా హీరోలు. అయితే చిరంజీవి సర్జ గుండెపోటు తో కొంత కాలం కిందట మరణించారు. ఇక లక్ష్మి దేవమ్మ పార్థివ దేహం ఇంకా బెంగళూరు అపోలో ఆసుపత్రిలో ఉంది.



























