Art Director Anand Sai : సినిమాలో హీరో హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నా వారు ఉన్న బావక్ గ్రౌండ్ కూడా అంతే అందంగా కనిపిస్తేనే కనుల పండుగగా ప్రేక్షకులకు ఉంటుంది. సినిమా ఫ్రేమ్ లో చుట్టూ ఉన్న సీనరీ ఒకెత్తయితే సెట్టింగ్స్ కి మరో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి సెట్టింగ్స్ లో తనదైన శైలి చూపించి ఆర్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆనంద్ సాయి. ఆయన ‘తొలిప్రేమ’ సినిమాలో ఒక పాటకోసం సముద్ర తీరాన తాజ్ మహల్ సెట్ వేసి ప్రేక్షకులను అలరించారు. అలా ఆర్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు తెలంగాణ తిరుపతి యాదాద్రి నిర్మాణంలో చీఫ్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు.

పవన్ నేను అలా సినిమా వెళ్ళేవాళ్ళం…
ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న ఆనంద్ గారు పవన్ కళ్యాణ్ హీరో అవ్వక ముందు నుండే పరిచయం అంటూ తెలిపారు. ఇద్దరికీ ముందు నుండి స్నేహం ఉందంటూ తెలిపిన ఆయన ఏనాడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అన్నట్లుగా వ్యవహరించలేదు అంటూ తెలిపారు. చాలా సింపుల్ గా పవన్ ఉంటాడు అంటూ తెలిపారు.

ఇక ఇద్దరం నేల టికెట్ తీసుకుని రజనీకాంత్ సినిమా చూడ్డానికి వెళ్ళే వాళ్ళం అంటూ తెలిపారు. ఇక ఆనంద్ సాయి గారి భార్య ఎవరో కాదు తొలిప్రేమ సినిమా లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి. తనతో ప్రేమ వివాహాం చేసుకున్న ఆనంద్ గారు తాను సినిమా సెట్టింగ్స్ వేసినపుడు కూడా వాస్తు చూసుకునే సెట్టింగ్స్ వేస్తారట.






























