Artist Ajay Ghosh : అవకాశాల కోసం చాలా తిరిగాను… కూలి పనులకు వెళ్ళేవాడిని… వాళ్ళవల్లే ఈరోజు ఇలా… భార్య గురించి చెబుతూ…: నటుడు అజయ్ ఘోష్

0
44

Artist Ajay Ghosh : 2010వ సంవత్సరంలో విడుదల అయిన ‘ప్రస్థానం’ సినిమా ద్వారా సినిమాలకు పరిచయం అయ్యాడు అజయ్ ఘోష్. తరువాత రన్ రాజా రన్, జ్యోతి లక్ష్మి, బహుబలి 2, భాగమతి, రంగస్థలం వంటి సినిమాలలో నటించి అభిమానులకు చేరువ అయ్యారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని కొండా రెడ్డి పాత్రతో ఆకట్టుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అజయ్ ఘోష్ అలరించాడు. తాజాగా ఓటిటి లో విడుదల అయిన ‘రుద్రంగి’ సినిమాతో మరోసారి నటుడుగా అలాగే రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తనకు సంబందించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నా భార్యకు చేతులెత్తి మొక్కాలి… వాళ్ళే లేకపోతే ఈ రోజు ఇలా…

అజయ్ ఘోష్ గారు మొదటి నుండి నాటకాలు వేస్తూ కళాకారుడిగా ఉంటూ కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోలేదట. అయితే చీరాల వద్ద వేటపాలెం గ్రామం కాగా ఆయన కూలి పనులను చేసుకుంటూ బతికేవారట. నటన మీద ఉన్న పిచ్చితో సినిమాల్లోకి అడుగుపెట్టినపుడు అవకాశాల కోసం బాగా తిరిగాను ప్రస్థానం సినిమాతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాను అంటూ చెప్పారు. అయితే తాను ఇంతదాకా రావడానికి కారణం నా భార్య రామలక్ష్మి అంటూ చెబుతారు, ఆమె కూలి పనులకు వెళుతూ పిల్లల బాధ్యత తీసుకోవడం వల్లే నేను ఇపుడు ఇక్కడ ఉన్నానని చెప్పారు. ఇక కరోనా సమయంలో బాలు గారి వంటి దిగ్గజం చనిపోయాక సినిమాలు వద్దనిపించింది.

అయితే మంచు విష్ణు, రామ్ చరణ్, సుకుమార్ వంటి వారు ఫోన్ చేసి ధైర్యం చెప్పి నటించమన్నారు. పుష్ప లో నటించనని చెప్పినా సమయం తీసుకుని నువ్వే చేయాలి ఈ పాత్ర అని సుకుమార్ చెప్పారు. అల్లు అర్జున్ షూటింగ్ కి వెళ్ళాక మీరు చేయకపోతే నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని, ఈ పాత్ర మీరైతేనే బాగుంటుందని చెప్పారు. ఆ అబ్బాయికి నేను రుణపడి ఉంటాను అంటూ అజయ్ ఘోష్ తెలిపారు. ప్రస్తుతం పలు సినిమా ఆఫర్స్ ఉండగా మరిన్ని కథలను రాసి సినిమాలను తీయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.