Artist Gummadi Jayavaani : సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చాలా మంది ఆశపడుతారు. కొంతమందికి కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి మంచి అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో స్థిరపడుతారు. మరి కొంతమందికి అలాంటి అవకాశం దొరకదు. అయితే కొంతమంది మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ కోవకే చెందుతారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి. గుంటూరు కి చెందిన గుమ్మడి జయవాణికి సినిమాలంటే పిచ్చి. చిన్నతనం నుండే సినిమా మీద ఆసక్తి తో అటు వైపు వెళ్లాలని అనుకునేది. ఇది గమనించిన పెద్దలు త్వరగా పెళ్లి చేసేసారు. అయితే భర్త సహకారంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది జయవాణి.

నల్లగా ఉన్నానని అవకాశాలు రాలేదు…
గుమ్మడి జయవాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లోను అలాగే విలన్ గా పలు సీరియల్స్ లోను నటించిన ఆమె సినిమాల మీద చిన్నప్పటి నుండి పిచ్చి ఉండటంతో సినిమాల్లో నటించాలని అనుకునేదట. అయితే చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగిన జయవాణి పదో తరగతి అయ్యాక సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటే తండ్రి సినిమాలలోకి అంటే పెళ్లి చేస్తాను లేదంటే ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్తావా అని అడిగితే సినిమాల్లోకి వెళ్తానని చెప్పిందట.

దీంతో బంధువుల అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేసేశారట. అయితే పెళ్లయ్యాక భర్త సహకారంతోనే సినిమాల్లో నటించారు. అయితే తొలినాళ్ళలో నల్లగా ఉండటం వల్ల అవకాశాలు రాలేదని ఒకవేళ ఎవరైనాన అవకాశం ఇచ్చినా చివరి నిమిషంలో కాన్సిల్ చేసేవారని చెప్పారు. దీంతో మేకప్ చేసుకోవడం బాగా నేర్చుకున్న జయవాణి ఆడిషన్స్ కి వెళ్లినా మేకప్ చేసుకుని వెళ్లి అవకాశాలు తెచ్చుకుందట.