Artist Pramila Rani : బాహుబలి సినిమాలో ఒక్కరోజుకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే…: నటి ప్రమీల రాణి

0
116

Artist Pramila Rani : దాదాపు 85 కు పైగా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకున్న నటి ప్రమీల గారు. బాహుబలి బామ్మ గా మంచి గుర్తింపు అందుకున్న ప్రమీల గారు మొదట వద్దు బావ తప్పు, రియల్ పోలీస్, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు, వేదం, బాహుబలి, విక్రమార్కుడు, చలో వంటి చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువగా వేదం, బాహుబలి సినిమాల్లో గుర్తింపు అందుకున్న ఆమె తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.

బాహుబలికి అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాను…

నాటక రంగం నుండి డబ్బింగ్ అలాగే సినిమాల్లోకి వచ్చిన ప్రమీల రాణి గారు సినిమాల్లో రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. చిన్న సినిమాల్లో రెమ్యూనరేషన్స్ సరిగా ఇచ్చేవారు కాదు, నాటకాలు వేసినపుడు ఈ ఇబ్బంది ఎదుర్కొన్నానంటూ చెప్పారు. ఇక బాహుబలి వంటి పెద్ద సినిమాకు పనిచేసినపుడు వాళ్ళు రెమ్యూనరేచన్ ఖచ్చితంగా ఇచ్చారంటూ చెప్పారు.

రెండు భాగాలకు కలిపి 34 రోజులు పనిచేయగా రెండు రోజులు కెమెరా ముందుకు వెళ్లకపోయినా రోజుకు పదివేల చొప్పున మొత్తం డబ్బులు ఇచ్చారు. వల్లి గారు చాలా బాగా చూసుకున్నారు. అందరూ అమ్మ అనే పిలిచేవారు. శాంతినివాసం సీరియల్ అప్పటి నుండి రాజమౌళి ని చూస్తున్నా, వారి కుటుంబంతో అనుబంధం ఉంది అంటూ చెప్పారు ప్రమీల.