అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన ‘పుష్ప: ది రైజింగ్’ మూవీలో సమంత స్పెషల్ సాంగ్ ‘‘ఊ అంటారా? ఉఊ అంటారా’’కు ఎంత క్రేజ్ లభించిందో అందరికీ తెలిసిందే. అందులో సమంత లుక్స్ చూసి.. అభిమానులు ఈలలు వేశారు. ఇప్పటికే ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి దాదాపు 110 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించింది. ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఆ సాంగ్ పై ఎన్నో పారెడీ సాంగ్ లు కూడా వచ్చాయి.

ఈ పాటపై ఎంతో మంది తన డ్యాన్స్ పర్ ఫామెన్స్ చూపిస్తూ.. ఇన్ స్టాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ సమంతగా పేరుతెచ్చకున్న బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి కూడా ఈ పాటకు చిందులేసింది. ఈ సందర్భంగా సమంత లుక్స్‌లోని తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా. పాటను రీషూట్ చేసిన ఆశు రెడ్డి.!
టిక్ టాక్, సోషల్ మీడియాతో క్రేజ్ సంపాదించి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన అషూరెడ్డి.. ఆమె ముఖ కవలికలు కాస్త సమంతను పోలి ఉండటంతో.. జూనియర్ సమంత అనే పేరు వచ్చింది. బిగ్ బాస్ నుంచి ఆమె బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న కామెడీ షోలు.. టాక్ షోలో చేస్తూ.. అందులో పాల్గొంటూ వచ్చింది. అంతే కాదు హాట్ ఫొటోలను తన సోషల్ అకౌంట్లో షేర్ చేస్తూ అభిమానులకు కూడా దగ్గరవుతూ వచ్చింది.

ఇక ఇటీవల ఆమె కాంట్రవర్సీ కా బాప్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఇంకా పాపులర్ అయ్యింది. ఇక ప్రస్తుతం సమంత యాక్ట్ చేసిన ఐటెం సాంగ్ కు తనదైన శైలిలో పర్ఫార్మ్ చేయబోతోందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది అషూరెడ్డి. గెస్ దిస్ సాంగ్ అంటూ అభిమానులకు ప్రశ్న కూడా సంధించింది. ఆ గెటప్ చూసి అందరూ సమంత ఐటెం సాంగ్ అంటూ చెప్పగా.. ఈ సాంగ్ త్వరలోనే మీ ముందుకు వస్తుందని చెప్పొకొచ్చింది.































