తెలుగు బుల్లితెర స్టార్ మా లో ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ అనే రియాలిటీ షో లో టిక్ టాక్ ఫేమ్ ఆషు రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే.. ఈమె బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పవచ్చు.ఇదిలా ఉంటె ఈ భామకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చేంత ఇష్టం. ఓసారి పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేయించుకుని.. అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు తాజాగా ఆమెకు పవన్ కళ్యాణ్‌‌తో కలిసి మాట్లాడే అవకాశం దక్కడంతో.. ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.”నేను నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూను కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇద్దరం రెండు గంటల పాటు మాట్లాడుకున్నాం.

ashu reddy

ఇక తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన తన స్వదస్తూరితో రాసిన లెటర్ ఇచ్చి పంపించారు” అని పేర్కొంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో నెటిజన్ ఆషూను ఓ ప్రశ్న అడిగి షాక్ ఇచ్చాడు.. ”ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగ‌వ భార్యగా ఉంటారా, అని ప్రశ్నించ‌గా.. అందుకు ఆషూ వెంటనే ఎస్ అని జవాబిచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో అభిమానులు అషూ.. నువ్ చాలా లక్కీ.. పవన్ పక్కన చాలా అందంగా ఉన్నావ్.. పవన్ కళ్యాణ్ రెండు గంటలు అపాయింట్‌మెంట్ అంటే మామూలు విషయం కాదు.. అంత టైం అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు.. అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే దీనిపై వెటకారాలు, ట్రోల్స్ కూడా మొదలయ్యాయి…ఇక పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ టార్గెట్ చేసే ఒక మీడియా వర్గం మాత్రం ఈ విషయాన్ని హైలైట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది..దీంతో ఆ వార్తలు కాస్త ఆషు రెడ్డికి కోపం తెప్పించాయి..కనీస నిజానిజాలు తెలుసుకోకుండా రాయడం ఎంతవరకు కరెక్ట్,పవన్ కళ్యాణ్ ను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పనా అంటూ సోషల్ మీడియాపై ఫైర్ అయ్యింది..అంతేకాదు అనవసరంగా పిచ్చి పిచ్చి రాతలు రాస్తే బాగుండదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటీ…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here