సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషురెడ్డి కూడా ఒకరు. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా క్రేజు తెచ్చుకుంది.ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే మొదట అషు రెడ్డి నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో తగిన గుర్తింపు తగ్గకపోవడంతో ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ బాగా ఫేమస్ అయింది. ఒక అనంతరం హౌస్ లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏర్పడిన పరిచయంతో షో అయిపోయిన తర్వాత కూడా విచ్చలవిడిగా తిరిగారు.
ఒక దశలో అయితే ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా అషు రెడ్డి కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా అషు రెడ్డి తాను ప్రెగ్నెంట్ అంటూ వాళ్ళ అమ్మ, ఫ్యామిలీ ముందు కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఇక ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ అని తన తల్లిని అడగగా.. ఇంకేముంది ఏమైనా తాగి చచ్చి పోదాం అంటూ ఎమోషనల్ అవుతూ అషు రెడ్డి పై చేయి చేసుకుంది.
చేయి చేసుకోవడమే కాకుండా కాలితో కూడా తన్నింది. అనంతరం లోపలికి వెళ్లి ఉండు మీ నాన్న గారికి ఫోన్ చేసి చెప్తాను అని అనగా.. అమ్మ ఆగమ్మ ఇదంతా ఫ్రాంక్ కావాలంటే కెమెరా చూడు అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది. దానితో అషు తల్లి నువ్వు ఫ్రాంక్ అని చెప్పినా నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనయ్యింది. నీ పై నాకు నమ్మకం ఉంది. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడు చేయకు అంటూ మందలించింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ఇంత దిగజారి పోతావా? అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు.




























