Ashu Reddy : సమంత డూప్ గా నెట్టింట్లో పాపులర్ అయిన అషు రెడ్డి, టిక్ టాక్, డబ్ స్మాష్ వంటి వాటి ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ కి వచ్చి ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయింది. అటు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ, ఇటు టీవీలో షోస్ చేస్తూ ఉన్న అషు రెడ్డి, రాం గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ తరువాత మరింత పాపులర్ అయింది. అటు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్, అప్ డేట్స్ తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ కి సోషల్ మీడియా లో వింత అనుభవం ఎదురైంది.

ఆర్ యూ వర్జిన్…
సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే అషు రెడ్డి ఇటీవలే తన వంటి మీద పవన్ కళ్యాణ్ పేరును టాటూ గా వేయించుకుని ఆ పిక్స్ ను నెట్టింట్లో పెట్టి సందడి చేసింది. పొట్టి బట్టలతో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారుని అట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా అషు తన సోషల్ మీడియా ఖాతాలో తన ఫాలోయర్స్ తో అస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ చిట్ చాట్ నిర్వహించింది. అయితే అందరూ ఒకేలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారు.

కొంత మంది ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే టాటూ చూడలేదా అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో ఎవరు అంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అని చెప్పింది. ఇక ఇలాంటి ప్రశ్నల మధ్యలో ఒక నెటిజెన్ వింత ప్రశ్న అడిగాడు. “ఆర్ యూ వర్జిన్..?” అని ప్రశ్నించగా నేను కన్యనే అంటూ వెక్కిరిస్తూ, నవ్వుతూ సమాధానం చెప్పింది. అషు రెడ్డి ఇలాంటి ఒక ప్రశ్నను అస్సలు ఉహించుండదు పాపం. అయితే తడబడకుండా బాగానే సమాధానం చెప్పింది. సాధారణంగా సెలబ్రిటీలకు ఇలాంటి ప్రశ్నలు మామూలే అయిపోయాయి.






























