Astrologer Venu Swamy : శృంగారం చేసేటప్పుడు కామాఖ్య అమ్మవారిని తలుచుకోవాలి… అలా చెయ్యకపోతే..: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

0
476

Astrologer Venu Swami : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనని, తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉండే వేణు స్వామి తాజాగా సెక్స్ చేసేటపుడు దంపతులు అమ్మవారిని తలచుకోవాలి అంటూ మాట్లాడాడు.

కామాఖ్య అమ్మవారిని తలచుకోకుంటే…

వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలను చెబుతూ అందరు రాజకీయ ప్రముఖులకు అలానే సినిమావాళ్లకు నేనే జాతకాలు చెబుతానంటూ చెప్పే ఈయన అమ్మవారికి పూజ చేసే సమయంలో మద్యం, మాంసం, ముద్ర, మంత్రం ఇలా నాలుగింటినీ ఉంచి ఐదో విషయం సెక్స్ అది కూడా ఉంచకపోతే పూజ ఫలితం ఉండదు, అందుకే పూజ చేసే సమయంలో శృంగారం గురించి అలోచించి అమ్మవారి పూజ చేస్తాం అంటూ కాంట్రావెర్సీ టాపిక్ మాట్లాడాడు.

Venu Swamy: టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి… ఆ హీరోకి తిరుగులేదు!
Venu Swamy: టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి… ఆ హీరోకి తిరుగులేదు!

అక్కడితో ఆగకుండా శృంగారంను ప్రపంచంలోని అందరూ విచిత్రంగా చూస్తారు కానీ అది దైవకార్యం అంటూ చెప్పారు. భార్య భర్తలు కార్యం చేస్తున్న సమయంలో ఖచ్చితంగా కామాఖ్య అమ్మవారిని తలచుకోవాలి, అది నేను చెబుతున్నది కాదు దశమహాకారాలలో ఒక నియమం అంటూ చెప్పారు. ఇటువంటి విషయాలను మిగిలిన వారు చెప్పరు అంటూ వేణు స్వామి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేసారు.