Astrologer Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలో వాళ్ళు విడిపోతారని చెప్పారు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది నేనేనని, తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉండే వేణు స్వామి ఇటీవల ఒక స్టార్ హీరో చనిపోతాడని అలాగే ఒక హీరోయిన్ కి అనారోగ్యం వస్తుందని చెప్పాడు. ఇక ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గురించి హాట్ కామెంట్స్ చేసారు.

ప్రభాస్ జాతకంలో ప్రస్తుతం శని…
బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి మాట్లాడుతూ ప్రభాస్ జాతకం ప్రకారం ప్రస్తుతం శని ఉందని, అర్ధష్టమ శని నడుస్తోందని తాను ఎంత ప్రయత్నించినా సినిమా సక్సెస కాదని చెప్పారు. ఇక ఆరోగ్యం కూడా అంత బాగా ఏమి ఉండదంటూ చెప్పారు వేణు స్వామి. తాను చెప్పేవి ఈ రోజు గురించి కాకపోయినా కొద్ది రోజుల్లో అవే జరుగుతాయి, అప్పుడు వేణు స్వామి చెప్పాడు కదా అని మీరే అనుకుంటారు అంటూ చెప్పారు.

రామ్ చరణ్ కు సంతానం ఆలస్యమవుతుందని ఏడేళ్ల క్రితం చెబితే అందరూ నెగెటివ్ గా మాట్లాడారు, ఇప్పుడు అదే జరిగింది. ప్రభాస్ కు 2023 సంవత్సరం కలిసి రాదు అంటూ చెప్పాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ నుండి రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్ తరువాత వస్తోన్న ఆదిపురుష్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఈ వేణు స్వామి మాటలు నిజమైతే ఏంటి పరిస్థితి అని టెన్షన్ పడుతున్నారు. ఇంతవరకు ఏమో కానీ ప్రభాస్ సినిమా ఆదిపురుష్ ఫలితం ఖచ్చితంగా వేణు స్వామి మాటలు నిజామా కదా అనేది నిర్ణస్తుందంటూ చాలా మంది భావిస్తున్నారు.



























