Astrologer Venuswamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలో వాళ్ళు విడిపోతారని చెప్పారు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనేనని తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉండే వేణు స్వామి ఇటీవల ఒక స్టార్ హీరో చనిపోతాడని అలాగే ఒక హీరోయిన్ కి అనారోగ్యం వస్తుందని చెప్పాడు. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరు టాప్ హీరోలు చనిపోతారంటూ చెప్తున్నాడు.

తారకరత్న విషయంలో నేను చెప్పినట్లే జరిగింది…
2026 లోపు టాలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ హీరోలు మరణిస్తారని నేను చెప్పిన మాటలు కొంతవరకు నిజామయ్యాయంటూ వేణుస్వామి మరోసారి మాట్లాడారు. నేను ఆ హీరోల పేర్లు చెప్పలేదు. కానీ వారి రాసులను చెప్పాను వృశ్చిక రాశి, మిథున రాశికి చెందిన ఇద్దరు హీరోలు మరణిస్తారు.

అందులో తారకరత్న ఆల్రెడీ మరణించాడు. ఇక మరో హీరో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు, అయితే ఇది ఈ సంవత్సరం లోనే జరుగుతుందని చెప్పడం లేదు 2026 లోపు జరుగుతుంది అంటూ చెప్పారు. ఇక మరో టాప్ హీరోయిన్ కూడా అనారోగ్యంతో బాగా అవస్థలు పడుతుంది అంటూ చెప్పారు. ఇప్పటివరకు తాను చెప్పినవన్నీ జరిగాయని, అవగాహనా లేని వాళ్ళు అర్హత లేని వాళ్ళు కూడా నన్ను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ చెప్పారు.
































