అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. సైదాబాద్ ఘటన మరువకముందే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ఇలా బాలికలకు, మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ 12 ఏళ్ల బాలికపై కన్నేసి.. అత్యాచారం చేసి.. ఆరు నెలల గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బోదన్ రోడ్ లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మాజిద్.. తన ఇంటి పక్కనే ఉంటున్న ఓ 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు.
ఈ క్రమంలో ఓ రోజు అతడు ఆ బాలికను బెదిరించి, మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఇలా ఆ బాలికను బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రలు మందలించారు.
ఆమె 6 నెలల గర్భవతి అని తేలింది. దీంతో అస్సలు విషయం బయటకు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరాయి. అభం శుభం తెలియని తన బిడ్డపై ఆ దుర్మార్గుడు చేసిన పనికి వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…