Babu Gogineni supports Vishwak Sen : టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయమై దేవి నాగవల్లి సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కంప్లైంట్ చేయగా, అటు విశ్వక్ సేన్ నిన్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం, ఇలా ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అంతేకాకుండా ఈ వివాదంలో కొంతమంది విశ్వక్ సేన్ కు సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది దేవి నాగవల్లి కి సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో అంతా ఈ వివాదానికి సంబంధించిన రచ్చ నే సాగుతోంది. అయితే తాజాగా ఈ వివాదానికి సంబంధించి బాబు గోగినేని ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న బాబు గోగినేని ట్వీట్…..
అయితే ఈ మొత్తం వివాదంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దేవి నాగవల్లి కి మద్దతు మద్దతు పలికారు. “ఎంత కోపం, చిరాకు వచ్చినా మహిళలపై అలాంటి పదాలను ప్రేరేపించకూడదు. ఇలాంటి చర్యను సహించబోము. విశ్వక్ సేన్ అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి” అంటూ మేయర్ విజయలక్ష్మి దేవి నాగవల్లి కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే మరోవైపు బాబు గోగినేని విశ్వక్ సేన్ కు మద్దతుగా ట్వీట్ చేశారు.“దేవి నాగవల్లి.. వీక్షకులతో పాటు విశ్వక్ సేన్‌కి కూడా క్షమాపణలు చెప్పాలి. ఆమెనే ముందుగా విశ్వక్ ని పాగల్ అని, డిప్రెషన్‌కి గురైన వ్యక్తి అని మాట్లాడిన తరువాతే ఈ వివాదం మొదలైంది” , అంటూ బాబు గోగినేని ట్వీట్ చేశారు.
Strongly condemn the words spoken by @VishwakSenActor on @TV9Telugu Anchor @Devi_Nagavalli. No amount of anger or frustration should trigger such words against women. Such action will not be tolerated. Vishwaksen should Refrain from making such heinous comments. pic.twitter.com/BEhku4zIwQ
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) May 3, 2022
అయితే నెటిజనులు ఈ వివాదంలో మేయర్ విజయలక్ష్మి చేసిన ట్వీట్ మీద స్పందిస్తూ… ఈ వివాదంలో విశ్వక్ సేన్ ఎంత తప్పు ఉందో దేవి నాగవల్లి కూడా అంతే తప్పు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదంలో మొదటి దేవీ నాగవల్లి నే విశ్వక్ సేన్ను రెచ్చగొట్టింది అంటూ, అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మీరు మద్దతు ఇస్తారా అని మేయర్ విజయలక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. స్టూడియోకి మీరే అతిథిగా ఆహ్వానించి ఆ వ్యక్తిని మీరు అవమానిస్తారా అంటూ… ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాబు గోగినేని చేసిన ట్వీట్.. మేయర్ చేసిన ట్వీట్ కు నెటిజనుల నుంచి వచ్చిన కామెంట్స్ కు దగ్గరగా ఉండటంతో, విశ్వక్ సేన్ కు సపోర్ట్ చేసే వారికి బాబు గోగినేని ట్వీట్ ఒక ఆయుధంగా మారింది.

































