Babu Mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆహుతి, అంకుశం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని చాలా తక్కువ సమయంలో కమెడియన్ గా బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు బాబు మోహన్. కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడి అప్పట్లో ప్రతి సినిమాలోనూ ఉండేది. ప్రతి సినిమాకు వీళ్ళిద్దరూ హిట్ కాంబినేషన్. ఇక బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబినేషన్ కూడా బాగా హిట్ అయింది. ఇక కచ్చితంగా సినిమాల్లో బాబు మోహన్ కి పాట పెట్టడం ఆనవాయితీ అయిపోయింది.

ఎన్టీఆర్ ను పడగొట్టడంలో చంద్రబాబు, కెసిఆర్ ప్లాన్ చేసారు…
ఇక ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న బాబు మోహన్ ను రాజకీయాల్లోకి రావాలని అడుగగా బాబు మోహన్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక రాజకీయాల్లో టీడీపీ నుండి రెండు సార్లు గెలిచి రెండో సారి మంత్రి అయిన బాబు మోహన్, ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నడుమ తెరాస లో చేరారు. ఇక తెరాస పార్టీలో మళ్ళీ గెలుపొందారు. ఇక రెండోసారి టికెట్ రాకపోవడంతో బీజేపీ లో చేరిన ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలంగాణ లో బీజేపీ కి ఉన్న అవకాశాల గురించి మాట్లాడారు.

ఇక ఎన్టీఆర్ ను గద్దె దించి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు, కెసిఆర్ ఇంకా కొంత మంది బ్యాచ్ కలిసి ప్లాన్ చేసి ఎన్టీఆర్ ను సీఎం పదవి నుండి తొలగించారని చెప్పాడు బాబు మోహన్. చంద్రబాబు, కెసిఆర్ ల మధ్య ఉన్న పోలికల గురించి అడిగినపుడు ఇద్దరూ మేధావులే అంటూ, చంద్రబాబు మొండిగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, కెసిఆర్ తిమ్మిని బొమ్మిని చేయగల సమర్థుడు అంటూ చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెరాస కు పోటీ బీజేపీ నే అంటూ చెప్పారు. కాంగ్రెస్ లో రేవంత్ తప్ప పోరాడే వ్యక్తులు లేరని అభిప్రాయపడ్డారు.



































