Baby film director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ బేబీ సినిమా సక్సెస్ మీట్ లో ఒక హీరో తన సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదని అవమానించాడు అంటూ మాట్లాడటం బాగా వైరల్ అయింది. ఇక ఆ హీరో విశ్వక్ సేన్ కావడం తాను కూడా వివరణ ఇవ్వడం ఇవన్నీ జరిగిపోగా అసలు మ్యాటర్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాయి రాజేష్ క్లారిటీ ఇచ్చారు.

నేనసలు విశ్వక్ అని చెప్పలేదు…
డైరెక్టర్ సాయి రాజేష్ కథ వినకుండానే ఒక హీరో తనతో సినిమా చేయడానికి నో చెప్పాడని బేబీ సినిమా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పి కాంట్రవెర్సీ క్రియేట్ చేసాడు. అయితే ఆ హీరో ఎవరన్నది చెప్పలేదు. అయితే ఇటీవల విశ్వక్ ఒక సినిమా మీట్ లో మాట్లాడుతూ తన గురించి ఇలా ఒక డైరెక్టర్ మాట్లాడటం బాగోలేదని ఒక సినిమా చేయనని చెప్పే హక్కు నాకు ఉంటుందంటూ మాట్లాడాడు.

ఇక ఈ విషయం గురించి సాయి రాజేష్ మాట్లాడుతూ తానసలు విశ్వక్ పేరు చెప్పలేదని, తానే రివీల్ చేసుకున్నాడని, కథ విన్నాక నో చెప్పుంటే నేను ఫీల్ అయ్యేవాడిని కాదు కానీ అక్కడ జరిగింది వేరు అంటూ ఇక ఈ విషయం నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు, వివాదాలకు ఛాన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు అంటూ చెప్పారు.