Baby film Viraj Ashwin : ఆ సమయంలో సినిమాలు వద్దని వెళ్ళిపోదామని అనుకున్నాను…: బేబీ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్

0
49

Baby film Viraj Ashwin : చిన్న సినిమాగా విడుదల అయి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమా బేబీ. సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యూత్ కి నచుతుంది అనుకుంటే పెద్ద వాళ్లకు నచ్చి ఫ్యామిలీ తో కలిసి సినినకు వెళ్తున్న సినిమాను వంద కోట్ల దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలను కూడా ఆశ్చర్య పరుస్తూ సినిమా వందకోట్ల క్లబ్బుకు చేరువయింది. ఇక సినిమాలో విరాజ్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్. ఆయన మొదట అనగనగా ఒక ప్రేమ కథతో ఇండస్ట్రీ కి వచ్చి ఓటిటి సినిమా థాంక్యూ బ్రదర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తిగత అలాగే కెరీర్ విశేషాలను పంచుకున్నారు.

ఒక టైం లో సినిమాలు వద్దని వెళ్ళిపోదామనుకున్నాను….

విరాజ్ చెన్నై లో పుట్టి పెరిగిన ప్రముఖ ఎడిటర్ మార్థండ్ గారి మనవడు అలాగే మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడు. అలా సినిమాల మీద చిన్నప్పటి నుండే ఇష్టం పెంచుకున్న విరాజ్ చదువుయ్యాక అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న సమయంలో మేనమామల సలహాతో మొదట యాక్టింగ్ కోర్స్ చేసి ఆపైన అనగనగ ఒక ప్రేమ కథ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడట.

అయితే మధ్యలో కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ రావడం వెళ్లిపోవడం వంటివి జరిగినపుడు ఒక్కోసారి ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోదాం ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనే ఆలోచన వచ్చేదని మళ్ళీ దీని మీద ఉన్న ఇష్టం వల్ల సినిమాలను వదలబుద్ధి కాలేదంటూ చెప్పారు విరాజ్. ఇక ఇంట్లో అమ్మ నాన్న సపోర్ట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇండస్ట్రీ లో నిలదోక్కుకున్నాను అంటూ చెప్పారు. ప్రస్తుతం బేబీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విరాజ్ మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ తో రానున్న రోజుల్లో అలరించునున్నారు.