Bahubali Vinay : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయనకు అత్యంత ఆప్తుడైన బాహుబలి వినయ్ ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తాగించి చంపారు… ఆయన దేవుడు…
రాకేష్ మాస్టర్ ను దగ్గరగా చుసినవాళ్లకు తెలుసు ఆయన ఎలాంటి వాడో అంటూ బాహుబలి వినయ్ అభిప్రాయపడ్డారు. ఆయన చాలా మంచి వ్యక్తి, తన దగ్గరికి ఎవరైనా వచ్చి సహాయం చేయమని అడిగితే వెంటనే చెస్తారు. తన దగ్గర ఉందా లేదా అని చూడరు. ఈ యూట్యూబ్ లో ఆయనకు మద్యం తాగించి ఇంటర్వ్యూలలో రెచ్చగొట్టి మాట్లాడించి ఆయనను దిగజార్చారు. కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ చెప్పారు వినయ్.

ఆయన ఇంకెన్నాళ్లు బ్రతుకుతాడో ఆయనకు తెలుసు అందుకే ఆయన తన పిల్లలకు ఏదైనా చేయాలని కూతురు గురించి ఎక్కువగా ఆలోచించేవాడు అంటూ చెప్పారు. ఆయనలో చివరి రోజుల్లో చాలా మార్పు వచ్చిందని, పిల్లకు ఏదైనా చేయాలని అనుకునేవారని వినయ్ తెలిపారు. ఆయనకి మందు ఎక్కువగా తాగించి తాగించి ఇలా చేసారని ఫైర్ అయ్యారు. ఆయన చుట్టూ ఉన్న చాలా మంది ఆయనను మోసం చేశారంటూ చెప్పారు. అందరూ ఉపయోగించుకుని మోసం చేసినవాళ్ళే అంటూ రాకేష్ మాస్టర్ గురించి బాధపడ్డారు వినయ్. పిల్లలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే విజయనగరంలో ఆ షూటింగ్ కి వెళ్ళాడు. అంతలోనే ఇలా జరిగింది అంటూ అభిప్రాయపడ్డారు వినయ్.
































