Bairi Naresh : సాయి బాబా, అయ్యప్ప స్వామి మీద మరోసారి సంచలనం కామెంట్స్ చేసిన బైరి నరేష్…!

0
174

Bairi Naresh : నాస్తికవాదిగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగ వైరల్ అవుతున్న వ్యక్తి బైరి నరేష్. అయ్యప్ప స్వాముల గురించి వివాదాస్పద వాఖ్యలు చేసి బాగా వైరల్ అయ్యాడు. అయితే ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉంటానని కేవలం అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెబుతాను కానీ ఆ దేవుడికి కాదంటూ చెబుతారు నరేష్. దేవుడనే వాడు లేడని, మనిషికి మనిషి గౌరవం ఇచ్చుకోవలని, కులం-మతం అనేవి లేవంటూ ఆయన మాట్లాడుతారు. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి అయ్యప్ప స్వామి, సాయి బాబా మీద వివాదాస్పద వాఖ్యలను బైరి నరేష్ చేసారు.

దేవుడు లేడు… పిచ్చిగా నమ్మేవాళ్లకు నేను చెప్పేది ఒకటే…

బైరి నరేష్ దేవుడు లేడు అని నమ్మే నాస్తికవాది. ఆయన బౌద్ధం లోని సూత్రాలను పాటిస్తారు. ఏ విషయానికైనా లాజిక్ అలాగే హిస్టరీ ఉంటేనే నమ్మాలని, దేవుడు ఉన్నాడని ఎలా చెబుతారు అంటూ అభిప్రాయపడ్డారు. ఈరోజు నేను కొత్తగా అయ్యప్ప స్వామి గురించో సాయిబాబా గురించో పాటలు పాడలేదు. అవి అంతకు ముందు గద్దర్ వంటి ప్రజా కవులు పాడినవే. సాయి బాబా కాళ్ల మీద పడితే ఉంగరాల జుట్టు నుండి అవి తీస్తాడు చేతుల నుండి లింగాలు తీస్తాడు అంటూ చెప్తారు, అదే సాయి బాబా ఒక బూడిద గుమ్మడికాయ ఇస్తే వడియాలు పెట్టుకుంటాం అంటూ ఒక కవి చెప్పిన కవితనే నేను పాడింది అంటూ చెప్పారు.

ఇక అయ్యప్ప మాల వేసినపుడు అందరూ నిష్ఠగా ఉండి కులంతో సంబంధం లేకుండా అందరు స్వాములుగా పిలవబడతారు. అది నలభై రోజులు కాకుండా జీవితం మొత్తం పాటిస్తే సమాజం బాగుపడుతుందని చెప్పాను. నిష్టగా మాల వేసే వారికి నేను గౌరవం ఇస్తాను కానీ ఆ దేవుడికి కాదు. శబరిమళ లో వెలిగే జ్యోతి నిజం కాదు, అది అక్కడి ట్రావెన్ కోర్ట్ కూడా ఒప్పుకుంది. అది నిజం కానీ అది నేను మాట్లాడితే ఒప్పుకోరు అంటూ అభిప్రాయపడ్డారు.