Balagam fame Kota Jayaram : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీల్లో ఉన్నా కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో చాలా మంది ఆర్టిస్టులకు వచ్చింది. అలా సినిమాలో హీరోకి తండ్రి ఐలయ్యగా నటించిన కోట జయరాం గారు బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆయన కెరీర్ గురించి మాట్లాడారు.

కుక్క కంటే హీనమా…
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్న జయరామ్ గారు సినిమాల్లో కంటే సీరియల్స్ లో బాగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 40 కి పైగా సీరియల్స్ లో నటించిన ఆయన ఎక్కువగా పోలీస్ పాత్రలలో నటించారట. ఇక ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుతూ జయరాం గారి స్నేహితుడు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి మొదట ఈ క్యారెక్టర్ ఆఫర్ రాగా ఆయన చేయలేనని చెప్పడం అదే సమయంలో జయరామ్ గారు అక్కడ ఉండటంతో ఆడిషన్ అక్కడే చేసిన వేణు మళ్ళీ మూడు నెలల తరువాత ఆ పాత్రకు జయరాం గారిని సెలెక్ట్ చేశారట. అలా బలగం లో అవకాశం వచ్చిందని తెలిపారు.

అయితే అంతకుముందు తన సినిమా జర్నీ గురించి చెబుతూ చిన్న వేషాలైనా పర్వాలేదు అని చాలా సినిమాల్లో చేసానని అయితే మొదట్లో ఒక సినిమా సమయంలో బాగా చేస్తున్నానని కెమెరా మెన్ నా మీద ఫోకస్ పెడదామంటే పక్కన కుక్క మీద పెట్టు అతని మీద ఎందుకు అంటూ అనేసరికి బాధేసింది. కుక్కకి ఉన్న వాల్యూ ఆర్టిస్ట్ కి లేదా అనిపించింది. అదే కో డైరెక్టర్ మళ్ళీ ఎపుడైనా కనిపిస్తే మాట్లాడుతాడు నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తావ్ అని చెప్తాడు, అది అయన తప్పు కూడా కాదనిపిస్తుంది కానీ ఆ క్షణం బాధేసింది అంటూ చెప్పారు జయరాం.
































