Balagam fame Lalitha : సినిమాల్లో అవకాశల కోసం కాళ్ళరిగేలా తిరిగినా ఒక్క అవకాశం రాక ఎంతో మంది బాధపడుతుంటారు. కానీ ఒక్కసారిగా అవకాశం వచ్చి అది మంచి హిట్ అందుకుంటే మాత్రం ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అలానే ప్రస్తుతం బలగం సినిమా ద్వారా ఎంతో మంది నాటక రంగ కళాకారులు అలాగే అప్పటి వరకు చిన్న పాత్రలు వేస్తున్న ఆర్టిస్తులకు ఈ సినిమా ఒక బలమైంది. అలా సురభి నాటక రంగం నుండి వచ్చి బలగం సినిమాలో మొగిలయ్య చిన్న కోడలిగా గయ్యాళి పాత్రలో మెప్పించారు లలిత చిరంజీవి. ఆమె తాజాగా పలు ఇంటర్వ్యూ లలో ఆమె వ్యక్తిగత జీవితం అలాగే బలగం సక్సెస్ గురించి చెబుతున్నారు.

అమ్మమ్మ కస్టపడి పెంచింది….
లలిత గారి తల్లి సురభి కళాకారిని అయిన కూడా పెళ్లి చేసుకుని బయటికి వచ్చేసారు. లలిత గారి తండ్రి లారీ డ్రైవర్ అవడంతో తల్లి నాటకాలకు దూరమయ్యారు. ఇక లలిత గారికి 7 ఏళ్ల వయసులో ఉన్నపుడు తండ్రి యాక్సిడెంట్ లో మరణించడంతో కుటుంబం ఇబ్బందుల పాలయిందట. తల్లికి బయటికి వెళ్లి ఏమైనా పనిచేసే లౌక్యం లేకపోవడం వల్ల కొద్ది రోజులు అమ్మమ్మ వద్ద పెరిగారట.

అమ్మమ్మ ఆకుకూరలు అమ్మి పెంచారట ఇక తండ్రి ఉన్నంత కాలం చదువు విషయంలో అశ్రద్ధ చేస్తే బాగా కొట్టేవారని కాకపోతే ఆయన మరణించాక అమ్మమ్మ వేరే ఊరు వెళ్లిపోవడంతో అమ్మ కూలి పని చేసి పోషించేది. అన్ని కష్టాలను చూడటం వల్ల చదువు సరిగా సాగలేదు. 9 తరగతి వరకు చదివిన ఆపైన మానేసానని చెప్పారు లలిత. ఇక కరోనా సమయంలో బాగా ఇబ్బంది పడ్డామని తెలిపారు. ప్రోగ్రామ్స్ కి వెళితే కానీ డబ్బులు రాని పరిస్థితి అందుకే కరోనా లాక్ డౌన్ లో తిండికి, అద్ధే కట్టలేక బాగా ఇబ్బందులు పడ్డామని తెలిపారు లలిత.































