Balagam Fame Muralidhar : తెలంగాణ పల్లె సంస్కృతిని చూపుతూ కుటుంబ బంధాలను చూపించిన సినిమా బలగం. చిన్న సినిమాగా మొదలై మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా ఎంతో మంది సినిమాను చూసేలాగ సినిమా ఆకట్టుకుంది. అంతే కాకుండా సినిమా చూసి కొన్ని కుటుంబాలు కలిసిపోవడం అనేది చాలా గొప్పగా విషయం. ఒక సినిమా మనుషులను ఇంత ప్రభావతం చేస్తుందా అనేలాగా బలగం సినిమా నేడు అందరిని ఆలోచింపజేసింది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గారు ఇంటర్వ్యూ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాలో బూతులు మాట్లాడాను….
బలగం సినిమాలో ప్రతి ఒక్క పాత్ర సహజంగా ఉండటం వల్లే చూసే ప్రేక్షకులు ముఖ్యంగా తెలంగాణ పల్లె ప్రజలు సినిమాకు కనెక్ట్ అయ్యారు. అందులోనూ కొమరయ్య అల్లుడిగా చేసిన నారాయణ పాత్ర అలాగే కొడుకు ఐలయ్య పాత్రలు ఇద్దరు మాట్లాడుకోవడానికి అహం అడ్డురావడం వీరి మధ్యలో కొమరయ్య కూతురు నలిగిపోవడం చాలా సహజంగా చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి.

ఇక నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గారు సినిమాలోని కొన్ని సీన్స్ లో బూతులు మాట్లాడరట . అయితే సీన్ కి సరిపోతాయానే మాట్లాడిన మళ్ళీ సమస్య అవుతుందేమో అని డైరెక్టర్ వేణు చెబితే ఒకవేళ సెన్సర్ వాళ్ళు తీసెయమంటే అపుడు చూద్ధాం అని చెప్పేసరికి ఒక రెండు సన్నివేశాలలో బావమరిదిని తిట్టే సందర్భంలో బూతు మాట్లాడారట. అయితే సినిమా సెన్సార్ కి వెళ్ళినపుడు అక్కడ ఆ బూతులను మార్చి వేరే పదాలను చేర్చారట.

































