Balagam Fame Muralidhar : చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా నేడు రెండు రాష్ట్రాలలోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నగరాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా బలగం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకీ మంచి పేరు అలాగే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ గారు సినిమా గురించి అందులో అవకాశం ఎలా వచ్చింది వంటి విషయాలను అలాగే తన కెరీర్ లో తాను పడిన ఇబ్బందులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రెమ్యూనరేషన్స్ ఎగొట్టడం మామూలే…
సినిమా ఇండస్ట్రీలో అవకాశం వస్తే చాలు అనుకుని వెళ్తే అక్కడ రెమ్యూనరేషన్లు కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటారని, మనం గట్టిగా అడగలేని పరిస్థితిలో ఉంటామని తెలిపారు మురళీధర్ గారు. మొదటి సారి తీసుకున్న రెమ్యూనరేయేషన్ గురించి మాట్లాడుతూ 500 రూపాయలంటూ చెప్పిన ఆయన కొన్ని సినిమాలకు ఇంత అని మాట్లాడుకున్నాక చివర్లో కొంచం చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసే స్టేజిలో మనం లేనపుడు వాళ్ళిచ్చింది తీసుకుని వచ్చేయాలి.

డిజే టిల్లు సినిమాకు కూడా నాకు ఇలానే జరిగింది. పెద్ధ బ్యానర్ లో నటించేటప్పుడు నీకు అవకాశం ఇవ్వడమే గొప్ప అన్నట్లుగా వాళ్ళు చూస్తారు. చేసిన పనికి ఎంతో కొంత ఇవ్వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ పెద్ధ బ్యానర్ వాళ్ళతో రెమ్యూనరేషన్ కోసం మాట్లాడితే మరోసారి మనల్ని పిలవరు అనే ఉద్దేశంతో ఇచ్చింది తీసుకుంటాం. వాళ్లేమో పెద్ద బ్యానర్ లో అవకాశం ఇచ్చాం ఇంకా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాలా అని ఆలోచిస్తారు ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే అంటూ చెప్పారు.

































