Balagam Fame Rupa Lakshmi : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవిని తీశారు కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్న అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్తులందరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రూప లక్ష్మి గారు ఆ సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన కెరీర్ గురించి కూడా పంచుకున్నారు.

మొదట్లో ఎవరు గుర్తించలేదు….
బలగం సినిమాలో నటించిన ఆర్టిస్తులందరికి ఒకరకంగా బలగం ముందు బలగం తరువాత అన్నట్లుగా కెరీర్ లో గుర్తింపు వచ్చింది. అలానే రూప లక్ష్మీగారు కూడా అంతకుముందు కొన్ని సినిమాలలో చేసిన పెద్ధగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి రూపలక్ష్మి మాట్లాడుతూ హరిశ్ శంకర్ గారు బోయపాటి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారని నేనెవరో పెద్దగా తెలియని రోజుల్లోనే నాకు పెద్ధ ఆర్టిస్టుల మధ్య సీన్స్ పడ్డాయాంటూ తెలిపారు.

సుబ్రహ్మణ్యం ఫోర్ సేల్, జయ జానకి నాయక, వినయ విధేయ రామ వంటి సినిమాలు అలా వచ్చినవే అని తెలిపారు. జయ జానకి నాయక సినిమాలో నా కామెడీ టైమింగ్ ని ఇప్పటికీ ప్రశాంసిస్తారని కాకపోతే బలగం సినిమా మాత్రం చాలా మంది ఇంకా తెలియనివాళ్లకు కూడా నన్ను దగ్గర చేసిందని తెలిపారు.
































