Balagam Fame Vijayalakshmi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికి కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు గుర్తింపు వచ్చింది. అలా మేనత్త పాత్రలో నటించిన పోచవ్వ కు కూడా మంచి పేరు వచ్చింది. నిజానికి మన కుటుంబ వ్యవస్థలో ఇంటి ఆడపిల్లకు చాలా ప్రముఖ్యత యిస్తారు. ఇంట్లో ఏ వేడుక జరిగిన వాళ్ళు వుండాల్సిందే అలాంటిది బలగంలో మేనత్త పాత్రకు బాగా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్రకు ప్రాణం పోసారు విజయలక్ష్మి .

భర్త, కొడుకు మరణం బాధించింది….
విజయలక్ష్మి గారు సురభి కళాకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. హారికథ కూడా చెప్పే విజయలక్ష్మి గారు చాలా కాలంగా అవన్నీ వదిలేసి కాలం గడుపుతున్నారు. చేగుంట లో ముప్పై ఏళ్లకు పైగా ఉన్న విజయలక్ష్మి గారు అక్కడే పిల్లలను పెద్ధ చేసి పెళ్లిళ్లి కూడా చేశారట. ఆమెకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు కాగా పెద్ద కొడుకు పెళ్లి కూడా చేయక ముందే భర్త మరణించారట. ఆ తరువాత పిల్లలు పెళ్లిళ్లు చేసేసి వారితో ఉంటున్న సమయంలో కొడుకు మరణించడం తట్టుకోలేక పోయారట విజయలక్ష్మి.

రెండో కొడుకు మరణించే సమయానికి కోడలు గర్భవతిగా ఉందట. ఇక కొడుకు మరణంతో అక్కడ ఉండలేక హైదరాబాద్ లోని సురభి కాలనీకి వచ్చేసారట విజయలక్ష్మి. అయితే మళ్ళీ నాటకాలు, హారికథ చెప్పమని తన తోటి వారు ప్రోత్సహించిన తనకు బ్యాక్ పెయిన్ ఉండటం వలన చేయలేకపోయారట. ఇక సురభి కాలనీ కే వేణు గారు వచ్చి బలగం కోసం ఆడిషన్ తీసుకోవడం తో ఊరికే ప్రయత్నిద్ధం అని చేయాగ సెలెక్ట్ అయ్యానని నేడు తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకునేలా మంచి పాత్ర చేసానని ఇందుకు కారణం డైరెక్టర్ వేణు అంటూ ఎమోషనల్ అయ్యారు.

































