Balagam Movie director Venu : సినిమాల్లో కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక పలు ఛానెల్స్ లో పనిచేసారు. ఇక ఆ తరువాత సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూనే అలరించిన ఆయన అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. ఆ సినిమాకు సంబంధించిన ముచ్చట్లను వేణు డైరెక్టర్ వివి వినాయక్ తో పంచుకున్నారు.

ఎన్టీఆర్ అప్పటికి స్టార్ కాదు…
వివి వినాయక్ బలగం సినిమా గురించి మాట్లాడుతూ ఒక తమిళ సినిమాను చూసినట్లుగా ఉందని తెలుగు కమర్షియల్ సినిమాల కాకుండా ఒక కల్ట్ సినిమా చేసావంటూ వేణు ని అభినందించారు. సినిమా కోసం పనిచేసే సమయంలో కాల్షీట్స్ టైమింగ్స్ చూసుకోలేదని వేణు చెప్పినప్పుడు ‘ఆది’ సినిమా చేసే సమయంలో నేను కూడా సమయం చూసుకోకుండా రాత్రి పగలు షూటింగ్ చేసానని చెప్పారు.

సెట్ లో ఉన్న ఏ ఒక్కరూ టైం దాటింది పని చేయం అని అనలేదని, అప్పటికి ఎన్టీఆర్ చిన్న కుర్రాడు అదీ కాక పెద్ధ స్టార్ కూడా కాదు సినిమాలో ఎవరు స్టార్ హోదా వాళ్ళు లేకపోవడం వల్ల అది సాధ్యమైందని, నీ సినిమాలో కూడా అలానే జరిగిందని కథ కనెక్ట్ అయినపుడు టెక్నీషియన్స్ కూడా అలానే పనిచేస్తారంటూ వినాయక్ అభిప్రాయపడ్డారు. ప్రతి వినిమా బాహుబలి లాగా వసూళ్లు చేయదంటూ అభిప్రాయపడ్డారు. అయితే బలగం సినిమా మొదటి రోజు 50 లక్షల దాకా వసూళ్లు చెస్తే విడుదల రోజు నుండి ఈరోజు వరకు అలానే వసూళ్లు వస్తున్నాయని తగ్గలేదని వినాయక్ తెలిపారు. సినిమా బడ్జెట్ 5 కోట్లయితే ఎపుడో అది వచ్చేసిందని అభిప్రాయపడ్డారు.