Balakrishna : మాస్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో అంటే బాలయ్య బాబే. అది ఆంధ్ర అయినా అమెరికా అయినా బాలయ్య సినిమా వచ్చిందంటే ‘జై బాలయ్య’ అనాల్సిందే. ఇంత క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదేమో. అందరికీ అభిమానులుంటారు కానీ బాలయ్య బాబుకి మాత్రమే భక్తులు అందునా ఊర మాస్ భక్తులుంటారు. మగ, ఆడ, చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అభిమానులు ఉండటం బాలయ్యకే చెల్లింది. తన తండ్రి వారసత్వంతో హీరోగా వచ్చినా సొంత ఫ్యాన్ బేస్ తో దూసుకెళ్తున్న హీరో బాలకృష్ణ. బాలయ్యబాబుకి కోపమెక్కువ, అభిమానులను కొడతాడు అంటూ ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నా, కొట్టినా పెట్టినా మా బాలయ్య బాబూకే చెల్లింది అనేది అభిమానుల స్ట్రాంగ్ కౌంటర్. సినిమా హిట్ ప్లాప్ తో బాలయ్య కి పని లేదు సినిమా నచ్చిందా డైరెక్టర్ ను నమ్మి చేస్తాడు. అలాగే బాలయ్య సినిమా హిట్ ప్లాప్ తో అభిమానులకు సంబంధం లేదు మరింత రెట్టింపు తో బాలయ్యని అభిమానిస్తారు.

అభిమానానికి నో ఏజ్ లిమిట్…
బాలయ్య ఈ మధ్యనే అఖండ సినిమాతో మంచి హిట్ కొట్టి ఊపు మీద ఉన్నాడు. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోను అంటూ హిట్లు కొడుతూ వరుసనా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో 107 వ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం కర్నూల్ వచ్చిన బాలయ్య కొండారెడ్డి బురుజు వద్ద చేరుకున్నపుడు అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.

No Age Limit For Fanism ????#NBK107 ???? pic.twitter.com/DwoCZOVWKW
— ???????????????????????????????????????????????????? ™ ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@RavirockzNTR) July 25, 2022
ఈలలు, అరుపులతో రచ్చ రచ్చ చేసారు. అందునా ఒక ముసలావిడ బాలయ్య రాగానే ఈలలు వేస్తూ అభిమానానికి ఏజ్ లిమిట్ లేదని నిరూపించింది. ఇక ఈ వీడియోని బాలయ్య అభిమానులు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. అభిమానానికి నో ఏజ్ లిమిట్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవలే టర్కీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలయ్య కుర్నాల్ లో షూటింగ్ కోసం వచ్చారు.






























