Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస హిట్లు అందుకున్న బాలయ్య ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బాలయ్య బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా బాలయ్య సినిమాల విషయంలో ఒక సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటాడు. అలాగే ఆయన అభిమానులకు కూడా బాలయ్య సినిమాల విషయంలో చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. బాలయ్య సినిమాకి కచ్చితంగా టైటిల్ లో సింహ అనే పేరు ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉంది.
అంతేకాకుండా విగ్గుల విషయంలో కూడా బాలయ్య అభిమానులకు సెంటిమెంట్ ఉంది. బాలయ్య ఒక్కో సినిమాలో ఒక్కో తరహా గెటప్ లో కనిపిస్తారు.
ఇలా వేర్వేరు విగ్గులను వాడటం వల్ల సినిమా సినిమాకు బాలయ్య లుక్ మారిపోతుంది. బాలయ్యకు విగ్గు సెట్ అయితే ఆ సినిమా హిట్ అవుతుందని అభిమానుల నమ్మకం. ఎందుకంటే ప్లాప్ అయినా సినిమాలలో బాలయ్యకు విగ్గు సెట్ అవ్వలేదు. అయితే బాలయ్యకి విగ్గు సెట్ అయిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. దీంతో బాలయ్య కూడా తన లుక్కు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ట్రెండ్ కు అనుగుణంగా బాలయ్య తనని తాను ఎప్పుడు మార్చుకుంటూనే ఉంటాడు. అంతేకాకుండా బాలయ్య సినిమాల విషయంలో మరొక సెంటిమెంట్ కూడా ఉంది. స్టార్ స్టేటస్ ఉన్న దర్శకులతో చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. అందువల్ల బాలయ్య తరచూ స్టార్ దర్శకులతోనే సినిమా చేయటానికి ఆసక్తి చూపుతాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై కూడా అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…