Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా పనులతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాకి మాటలు అందించిన ప్రముఖ రైటర్ సాయి మాధవ్ సినిమా విశేషాలతో పాటు బాలకృష్ణ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ కోపం గురించి సాయి మాధవ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
సాధారణంగా బాలకృష్ణకు కోపం ఎక్కువ అని, అందువల్ల అభిమానులపై తరచూ చేయి చేసుకుంటూ ఉంటాడని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అభిమానులు కూడా బాలకృష్ణని కలిసి ఫోటోలు తీసుకోవటానికి కొంతవరకు భయపడుతూనే ఉంటారు. అయితే బాలకృష్ణ ఇలా అభిమానులపై చేయి చేసుకోవటం వెనుక గల కారణం గురించి సాయి మాధవ్ వివరించాడు.
ఈ ఇంటర్వ్యూలో సాయి మాధవ్ మాట్లాడుతూ.. గతంలో తనకి, బాలకృష్ణకి మధ్య ఇలాంటి విషయం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు..హీరోలందరూ ఫ్యాన్స్ ని నెట్టేందుకు.. కొట్టేందుకే బౌన్సర్లని పెట్టుకుంటారు . అయితే నేను కూడా నా ఫ్యాన్స్ ని కొట్టేందుకు డబ్బులిచ్చి బౌన్సర్లని పెట్టుకోవాలా? నా ఫ్యాన్స్ నాకు ఫ్యామిలీతో సమానం. నా అభిమానుల్ని కొట్టేందుకు వాడెవడు? అందుకే నేను అలాంటి పని చేయను. నాకు కోపమొస్తే నేనే ఓ దెబ్బ వేస్తాను. వాళ్లకు కోపమొస్తే నా మీదకు వస్తారు అంతే. నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నా అభిమానులకు బాగా తెలుసు. నా గురించి ప్రత్యేకంగా ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని బాలకృష్ణ వివరించినట్లు సాయి మాధవ్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు మాపై ప్రేమతోనే మమ్మల్ని కొడతాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…