Balakrishna: నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈయన ఫలానా దర్శకుడు డైరెక్షన్లో ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభిమానులు ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఇకపోతే తాజాగా మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వార్తలు రావడంతో అభిమానులు ఈ విషయంపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అక్కడ చిత్ర బృందం సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వచ్చే ఏడాది తప్పకుండా ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో నందమూరి అభిమానుల ఆనందానికి ఆ వదులు లేకుండా పోయాయి.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బోయపాటి శ్రీను కూడా పాల్గొన్నారు. అయితే బోయపాటి దర్శకత్వంలో సినీ ఎంట్రీ ఉండబోతుందా అంటూ ప్రశ్నించగా ఆ ప్రశ్నకు బోయపాటి అంతా దైవ నిర్ణయం అంటూ సమాధానం చెప్పడంతో బాలయ్య తనలో తాను నవ్వుకున్నారు.
మరి వచ్చే ఎడాది మోక్షజ్ఞ బోయపాటి దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారా లేక మరో దర్శకుడు ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అఖండ సీక్వెల్ కూడా ఉండబోతుందంటూ చిత్ర బృందం చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని తెలియడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…